పాత నోట్ల మార్పిడి వ్యవహారం ఏ స్థాయిలో ప్రశంసలు కురిపిస్తుందో.. సామాన్యులకు కరెన్సీ కష్టాలు చూపించటంపై అదే స్థాయిలో విమర్శలను గుప్పిస్తోంది. ఇక పలువురైతే మండిపోయి ప్రధానినే టార్గెట్ చేస్తూ వీడియో సందేశాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరోవైపు రాహుల్ గాంధీ నిన్న అంతా మోదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉండగా, తాజాగా ఓ మంత్రి తనయుడు చేసిన నిర్వాకం తీవ్ర దుమారం రేపింది. తన ఫేస్ బుక్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ షేజ్వార్ కూడా ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో ‘‘అవినీతి నిర్మూలన అంటేనే ‘అచ్చేదిన్’ వచ్చేసినట్లని, ఇకపై ఎవరైనా ‘అచ్చేదిన్’ ఎక్కడా అని అడిగితే చెప్పుతో కొడతానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
అయితే, తన పోస్ట్ నచ్చితే ‘లైక్’ లేకపోతే ‘అన్ లైక్’ చేయండి, అంతేకానీ, రాద్ధాంతం మాత్రం చేయొద్దంటూ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ కు లైక్ లతో పాటు విమర్శలూ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై రాద్ధాంతమూ జరిగింది. మరోవైపు ఆ పోస్ట్ తన కొడుకు ఎందుకు చేశాడో తెలీదని, ఇప్పటి కాలంలో ఏం మాట్లాడినా రాద్ధాంతం అయిపోతుందని, ఇలాంటి వ్యవహారాల్లో ఎలా మసులుకోవాలో ముదిత్ ను తాను నచ్చజెప్పుతానని అతని తండ్రి, మంత్రి గౌరీశంకర్ వెనకేసుకురావటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more